ఉమ్‌ అల్‌ ఎమారత్‌ పార్క్‌లో ఎంట్రన్స్‌ ఫీజ్‌ రెట్టింపు

- August 28, 2019 , by Maagulf
ఉమ్‌ అల్‌ ఎమారత్‌ పార్క్‌లో ఎంట్రన్స్‌ ఫీజ్‌ రెట్టింపు

అబుదాబీలోని ఉమ్‌ అల్‌ ఎమరాత్‌ పార్క్‌ ఎంట్రన్స్‌ ఫీజు డబుల్‌ అయ్యింది. ప్రస్తుతం వున్న 5 దిర్హామ్‌ల ఫీజుని 10 దిర్హామ్‌లకు పెంచారు. సెప్టెంబర్‌ 1 నుంచి పెరిగిన టిక్కెట్‌ ధరలు అమల్లోకి వస్తాయి. పార్క్‌ని ముందు ముందు మరింత విస్తరించబోతున్నామనీ, ఈ నేపథ్యంలోనే టిక్కెట్‌ ధ్వరలు పెంచుతున్నామనీ ఓ ప్రకటనలో నిర్వామకులు పేర్కొన్నారు. కాగా, 12 నెలలకుగాను అన్‌లిమిటెడ్‌ ఎంట్రీ అవకాశం కల్పించేలా 499 దిర్హామ్‌ల గోల్డ్‌ కార్డ్‌ అందుబాటులో వుంది. 200 దిర్హామ్‌ల ఖర్చుతో సిల్వర్‌ కార్డ్‌ ద్వారా 25 ఎంట్రీ టిక్కెట్స్‌ని కార్డ్‌ హోల్డర్‌ పొందవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com