ప్రభుత్వాలు మాతృభాషల పరిరక్షణకు కృషి చేయాలి:ఉప రాష్ట్రపతి
- August 29, 2019
విశాఖ:ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే కొనసాగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.ప్రభుత్వాలు మాతృభాషల పరిరక్షణకు కృషి చేయాలని ఆయన సూచించారు.విశాఖ జిల్లా గంభీరంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. మాతృభాషా దినోత్సవాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాతూ..ఆనందం అనిపించినా, బాధ అనిపించినా మాతృభాషలోనే మాట్లాడతామని..ఇప్పుడు కొందరు ఆ భాషకు దూరమవుతున్నారన్నారు. భాషను కాపాడుకోవడం వల్ల సమాజాన్ని పరిరక్షించుకోవచ్చనే విషయాన్ని ఐరాస చెబుతోందని వెంకయ్య గుర్తు చేశారు.మాతృభాషను ప్రేమించమంటే ఇతర భాషలు వద్దని కాదన్నారు. రాజ్యసభ సభ్యులు 22 ప్రాంతీయ భాషల్లో మాట్లాడే అవకాశాన్ని ఛైర్మన్‌గా తాను కల్పించినట్లు వెంకయ్య వివరించారు. దేశ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వ్యక్తికి అందాలన్నారు. మన దేశం శాస్త్ర సాంకేతికంగా అనేక ఆవిష్కరణలను సాధ్యం చేస్తోందని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు