యూ.ఏ.ఈ లో తెలంగాణ వాసి ఆత్మహత్య

- August 29, 2019 , by Maagulf
యూ.ఏ.ఈ లో తెలంగాణ వాసి ఆత్మహత్య

యూఏఈ:అల్ అయిన్ లో నిజామాబాదు జిల్లా వాసి రామసరం హరీష్, NCTH కంపెనీ లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు,ఇతడు యూఏఈ వచ్చి నాలుగు నెలలు అవుతుంది, డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకొని మరణించాడు.ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు స్థానిక శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లడం తో దుబాయ్ లో ఉన్న ఏముల రమేష్ (అధ్యక్షులు -ప్రవాస హక్కులు) మరియు సంక్షేమ వేదిక -దుబాయ్ సభ్యులతో మాట్లాడి తొందరగా మృతదేహాన్ని ఇండియా పంపడానికి ఏర్పాట్లు చేయమని కోరారు.రమేష్  కంపెనీ ప్రతినిధులతో మరియు ఇండియన్ కాన్సులెట్ అధికారులతో ,తెలంగాణ NRI సెల్ అధికారులతో సంప్రదించడంతో అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేయడంతో ,ఈరోజు మృతదేహాన్ని ఎయిర్ ఇతిహాద్ ఫ్లైట్ లో ఇండియాకు బయలుదేరుతుంది.రేపు ఉదయం వరకు ఇంటికి చేరుతుంది,ప్రతి రోజు ఈవిషయం పైన ఇండియా నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నర్సింహం నాయుడు సలహాలు ఇస్తూ మృతదేహం తొందరగా రావడానికి సహకరించారు.అట్లాగే దీనికి ఆ కంపెనీ HR ఆఫీసర్ అజిత మరియు మృతుడి బంధువు ఒడ్డెన్న,అజయ్ తెడ్డు(ఉపాధ్యక్షులు -ప్రవాస హక్కులు మరియు సంక్షేమ వేదిక -దుబాయ్),బండి జగన్(ప్రధాన కార్యదర్శి),అరుణ్ కుమార్ సురునిదా(వర్కింగ్ ప్రెసిడెంట్),మహిపాల్ తలారి కార్యవర్గ సభ్యులు ,జనగామ శ్రీనివాస్(అడ్వైసర్),తెలంగాణ NRI డిపార్ట్మెంట్ ఆఫీసర్ చిట్టి బాబు తదితరులు సహకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com