ప్రభుత్వాలు మాతృభాషల పరిరక్షణకు కృషి చేయాలి:ఉప రాష్ట్రపతి

- August 29, 2019 , by Maagulf
ప్రభుత్వాలు మాతృభాషల పరిరక్షణకు కృషి చేయాలి:ఉప రాష్ట్రపతి

విశాఖ:ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే కొనసాగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.ప్రభుత్వాలు మాతృభాషల పరిరక్షణకు కృషి చేయాలని ఆయన సూచించారు.విశాఖ జిల్లా గంభీరంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. మాతృభాషా దినోత్సవాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాతూ..ఆనందం అనిపించినా, బాధ అనిపించినా మాతృభాషలోనే మాట్లాడతామని..ఇప్పుడు కొందరు ఆ భాషకు దూరమవుతున్నారన్నారు. భాషను కాపాడుకోవడం వల్ల సమాజాన్ని పరిరక్షించుకోవచ్చనే విషయాన్ని ఐరాస చెబుతోందని వెంకయ్య గుర్తు చేశారు.మాతృభాషను ప్రేమించమంటే ఇతర భాషలు వద్దని కాదన్నారు. రాజ్యసభ సభ్యులు 22 ప్రాంతీయ భాషల్లో మాట్లాడే అవకాశాన్ని ఛైర్మన్‌గా తాను కల్పించినట్లు వెంకయ్య వివరించారు. దేశ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వ్యక్తికి అందాలన్నారు. మన దేశం శాస్త్ర సాంకేతికంగా అనేక ఆవిష్కరణలను సాధ్యం చేస్తోందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com