తమిళనాడులో చొరబడిన తీవ్రవాదులు!
- August 29, 2019
తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘావర్గాల సమాచారంతో.. కోయంబత్తూర్‌లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది జాతీయదర్యాప్తు సంస్థ. దీంతో పాటు మరో ఐదు ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్‌లతో పాటు పలు మాల్స్‌లో సోదాలు నిర్వహించారు ఎన్‌ఐఏ అధికారులు. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తుల్ని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కోయంబత్తూరులో పట్టుబడిన అజరుద్దీన్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు. శ్రీలంక ద్వారా సముద్ర మార్గంలో ఉగ్రవాదులు చొరబడినట్లు ఎన్‌ఐఏకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. కొలంబో దాడుల అనంతరం.. ఇప్పటికే తూర్పు తీర రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది.
అనుమానితుల నుంచి ఎన్‌ఐఏ అధికారులు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అటు.. ఏపీలోని నెల్లూరు జిల్లాలోనూ పలు చోట్ల పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







