మహారాష్ట్ర:పరిశ్రమలో భారీ పేలుడు.. 20 మంది మృతి
- August 31, 2019
మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో ఉన్న ఓ రసాయనిక పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సిలిండర్లు పేలుడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 8 మృతదేహాలను వెలికితీశారు ఫైర్ సిబ్బంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో వంద మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, ఫ్యాక్టరీ నుంచి 40 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు అనంతరం ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమం ఉంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!