వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్
- August 31, 2019
అమరావతి: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలిసి సీఎం జగన్ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వన మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. శని వారం నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!