ముస్తాబైన ఖైరతాబాద్ వినాయకుడు

- September 01, 2019 , by Maagulf
ముస్తాబైన ఖైరతాబాద్ వినాయకుడు

హైదరాబాద్: వినాయకచవితి అనగానే ఖైరతాబాద్ గణేషుడే గుర్తుకు వస్తాడు. ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాడు. హైదరాబాద్‌లో ఎటు చూసినా వినాయకచవితి సందడే కనిపిస్తోంది. వినాయకచవితి అంటేనే బోలెడంత జోష్. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. గల్లి గల్లీలోనూ ఎక్కడ చూసినా గణపయ్య పేరే వినిపిస్తోంది. బొజ్జ గణపయ్య పూజలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వినాయకచవితి పండగ సమ్‌థింగ్ స్పెషల్. విగ్రహం ప్రతిష్టాపన దగ్గర నుంచీ నిమజ్జనం వరకూ అంతా భక్తి భావంతో ఉప్పొంగిపోతారు. ఘనంగా జరుపుకునేందుకు ఆరాటపడతారు. తమకు తోచిన విధంగా విగ్రాహాలు ప్రతిష్టించేందుకు ఆసక్తి చూపిస్తారు. రెండు, మూడు వారాల క్రితం నుంచే వినాయకచవితి ఉత్సవాల కోసం ఏర్పాట్లు మొదలెడతారు. ఈసారి కూడా గణేష్ పండుగ కోసం ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకున్నారు.
హైదరాబాద్‌లో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ స్పెషల్ ఎక్ట్రాక్షన్. ప్రతి ఏడాది విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి ఈసారి ద్వాదశాదిత్య మహా గణపతిగా సద్ధమయ్యాడు. 11 రోజులపాటు భక్తులను ఆశీర్వదించనున్నాడు. ప్రతియేటా ప్రముఖ సిద్దాంతి గౌరిభట్ల విఠలశర్మ సూచనతో గణేశుడి విగ్రహాన్ని ఉత్సవ కమిటీ తయారు చేసింది. ఈసారి వికారనామ సంవత్సరంలో విగ్రహాలకు అధిపతి అయిన సూరీడు రూపంలో గణపతిని తయారుచేయించారు. ఈ వినాయకుడిని పూజిస్తే లోకకల్యాణం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని నమ్మకం. రూ. కోటి వ్యయంతో 61 ఫీట్ల విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 12 తలలు,24 చేతులు, 7 గుర్రాలతో సూర్యావతారంలోని స్వామివారిని అందంగా ముస్తాబు చేశారు. శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహానికి తుదిమెరుగులు దిద్దారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com