పెళ్లి కుమార్తెగా ఆలియా భట్!
- September 02, 2019బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పెళ్లి కూతురిలా మారింది. అదేంటి ఆలియా రహస్య వివాహం ఏమైనా చేసుకుందని.. అనుకుంటున్నారా? ఆమె ఓ ప్రముఖ దుస్తుల బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ప్రమోషన్లో భాగంగా పెళ్లి కుమార్తె కాస్ట్యూమ్స్ లో మెరిసింది. ఎరుపురంగు లెహెంగా, ఆభరణాలతో పెళ్లికుమార్తె లుక్‌లో చాలా అందంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘
ఇటీవలే విడుదలైన ‘కళంక్’ సినిమాలో ఆలియా నటించారు. ప్రస్తుతం ఆమె ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో చరణ్ సరసన నటిస్తున్నారు.రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుగుతోంది. అలాగే బాలీవుడ్లో ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’ చిత్రాల్లోనూ ఆలియా కథానాయికగా నటిస్తోంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి