షార్జాలో స్కూల్ బస్‌కి అగ్ని ప్రమాదం
- September 03, 2019
షార్జాలోని కల్బాలో ఓ స్కూల్ బస్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. అయితే డ్రైవర్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి, తెలివైన నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులెవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీడియా సెంటర్ ఈ ఘటన గురించి స్పందిస్తూ, ప్రమాదం జరిగిన సమయంలో తక్కువమంది విద్యార్థులు మాత్రమే వున్నారనీ, డ్రైవర్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాడని తెలిపింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే షార్జా పోలీస్ కంట్రోల్ రూమ్, ఫైర్ ఫైటర్స్‌నీ అలాగే అంబులెన్స్‌లనీ, పారా మెడిక్స్‌నీ సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించగానే బస్ డ్రైవర్, బస్సుని పక్కనే ఆపి వెంటనే అందులోంచి విద్యార్థుల్ని కిందకి దించేశాడనీ, ఆ తర్తా బస్సులో అగ్ని కీలలు మరింతగా పెరిగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బస్సు ప్రమాదానికి కారణాల్ని అన్వేషిస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







