బిగ్ బాస్ షోలో వరుణ్ వితిక మధ్య భారీ గొడవ...!
- September 04, 2019బిగ్ బాస్ షో ప్రారంభమై ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకొని ఏడవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంతో పోలిస్తే బిగ్ బాస్ రేటింగ్స్ తగ్గుతున్నప్పటికీ బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. ఈ వారం ఎలిమినేషన్ కు రాహుల్ సిప్లిగంజ్, అలీ రేజా, మహేశ్ విట్టా, రవికృష్ణ, శ్రీముఖి నామినేట్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వితిక, వరుణ్ మధ్య గొడవకు కారణమైంది.
మొదట బిగ్ బాస్ ఇంట్లోకి దొంగలు వచ్చి ఇంట్లోని వస్తువుల్ని ఎత్తుకొని వెళ్తారు.బిగ్ బాస్ ఇంటి సభ్యులకు దొంగలు దోచిన నగరం అనే టాస్క్ ఇస్తాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడిపోయి టాస్క్ చేయమని చెబుతాడు. శిల్పా చక్రవర్తి దొంగలరాణిగా రవి, రాహుల్, వరుణ్, శివజ్యోతి, పునర్నవి దొంగలుగా ఒక గ్రూపులో ఉంటారు. నగర వాసులుగా అలీ, శ్రీముఖి, వితిక, బాబా భాస్కర్, హిమజ, మహేశ్ మరొక గ్రూపులో ఉంటారు.
బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య టాస్క్ లో భాగంగా గొడవలు జరుగుతూ ఉండటంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ పిలిచి బిగ్ బాస్ ఇంట్లో హింస ఆమోద యోగ్యం కాదని చెబుతాడు. వితిక చేతిలో ఉన్న గన్ ను వరుణ్ లాక్కోవడానికి ప్రయత్నించి వితిక చేతిలో ఉన్న గన్ ను వరుణ్ తీసుకుంటాడు. తన చేతిలో ఉన్న గన్ లాక్కోవటంతో వితిక వరుణ్ మధ్య గొడవ జరుగుతుంది. వితికను మినిమం కామన్ సెన్స్ ఉండాలని వరుణ్ తిడతాడు.
ఇద్దరి మధ్య గొడవ జరగటంతో శ్రీముఖి ఇద్దరినీ వారించటానికి ప్రయత్నం చేస్తుంది. బిగ్ బాస్ ఇంట్లో హింస జరగకూడదని చెప్పినప్పటికీ ఇంటి సభ్యుల మధ్య ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈరోజు కూడా ఈ టాస్క్ కొనసాగే అవకాశం ఉంది. మరి ఈరోజు ఈ టాస్క్ లో ఇంటి సభ్యుల మధ్య ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ