అబుదాబీ స్కూల్ బస్‌లకు కెమెరాలు
- September 04, 2019
అబుదాబీలోని అన్ని స్కూల్ బస్లకీ కెమెరాలను అమర్చి, స్టాప్ సైన్ ఉల్లంఘనలకు పాల్పడే మోటరిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని అబుదాబీ పోలీస్ వెల్లడించింది. దశల వారీగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ - ట్రాఫిక్ స్టడీస్ హెడ్ అబ్దుల్లా అల్ ఘఫెలి చెప్పారు. స్టాప్ సైన్ వున్నప్పుడు స్కూల్ బస్ని ఓవర్టేక్ చేయడం నేరం. విద్యార్థులు స్కూల్ బస్ దిగే సమయంలో స్టాప్ సైన్‌ని ఆన్ చేస్తారు. అప్పుడు ఆ బస్ని ఓవర్ టేక్ చేస్తే, ప్రమాదాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే స్టాప్ సైన్ ఉల్లంఘనకు భారీ జరీమానాలు, కఠిన చర్యలు చట్టంలో పేర్కొనబడ్డాయి. 2018-19లో ఈ తరహా ఉల్లంఘనలు 3,664 చోటు చేసుకున్నాయి. కాగా, స్టాప్ సైన్‌ని డిస్ప్లే చేయని స్కూల్ బస్ డ్రైవర్ల సంఖ్య 126గా నమోదయ్యింది. వీరిపైనా చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!