అబుదాబీ స్కూల్‌ బస్‌లకు కెమెరాలు

- September 04, 2019 , by Maagulf
అబుదాబీ స్కూల్‌ బస్‌లకు కెమెరాలు

అబుదాబీలోని అన్ని స్కూల్‌ బస్‌లకీ కెమెరాలను అమర్చి, స్టాప్‌ సైన్‌ ఉల్లంఘనలకు పాల్పడే మోటరిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని అబుదాబీ పోలీస్‌ వెల్లడించింది. దశల వారీగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అబుదాబీ ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డైరెక్టరేట్‌ - ట్రాఫిక్‌ స్టడీస్‌ హెడ్‌ అబ్దుల్లా అల్‌ ఘఫెలి చెప్పారు. స్టాప్‌ సైన్‌ వున్నప్పుడు స్కూల్‌ బస్‌ని ఓవర్‌టేక్‌ చేయడం నేరం. విద్యార్థులు స్కూల్‌ బస్‌ దిగే సమయంలో స్టాప్‌ సైన్‌ని ఆన్‌ చేస్తారు. అప్పుడు ఆ బస్‌ని ఓవర్‌ టేక్‌ చేస్తే, ప్రమాదాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే స్టాప్‌ సైన్‌ ఉల్లంఘనకు భారీ జరీమానాలు, కఠిన చర్యలు చట్టంలో పేర్కొనబడ్డాయి. 2018-19లో ఈ తరహా ఉల్లంఘనలు 3,664 చోటు చేసుకున్నాయి. కాగా, స్టాప్‌ సైన్‌ని డిస్‌ప్లే చేయని స్కూల్‌ బస్‌ డ్రైవర్ల సంఖ్య 126గా నమోదయ్యింది. వీరిపైనా చర్యలు తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com