వైద్య నిర్లక్ష్యంతో మరణించిన షార్జా నర్సు కుటుంబానికి 400,000 dhs నష్ట పరిహారం

- September 07, 2019 , by Maagulf
వైద్య నిర్లక్ష్యంతో మరణించిన షార్జా నర్సు కుటుంబానికి 400,000 dhs నష్ట పరిహారం

షార్జా:గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. తప్పు చేసిన వారిపట్ల ఎంతటి కఠిన వైఖరి అవలంభిస్తారో ఈ సంఘటన రుజువు చేస్తుంది. పైగా తీర్పులు కూడా సంవత్సరాల తరబడి నాన్చకుండా వెంటనే అమలు పరిచేలా చర్యలు తీసుకుంటారు. కేరళకు చెందిన అబ్రహం, బ్లెస్సీ టామ్ ‌భార్యా భర్తలు. షార్జా లో నివసిస్తున్న వారికి ఇద్దరు కుమారులు. బ్లెస్సీ.. షార్జా యూనివర్సిటీ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఛాతి ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతూ సన్నీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. 2015 నుంచి వారిచ్చిన మెడిసన్ వాడుతోంది. అయినా ఆరోగ్యంలో మార్పులేకపోగా రోజు రోజుకి వ్యాధి తీవ్రత ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఆసుపత్రి వైద్యులు యాంటీబయాటిక్స్ ఇవ్వడంతో బ్లెస్సీ మరణించింది. అనంతరం జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు బ్లెస్సీ గుండెపోటుతో మరణించిందని హాస్పిటల్ యాజమాన్యం మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది.

అయితే తన భార్యను వైద్యులే చంపేశారని, సరైన చికిత్స అందించని కారణంగానే ఆమె మరణించిందని హాస్పిటల్‌ వైద్యులపై షార్జా కోర్టులో కేసు వేశారు అబ్రహం. గల్ఫ్ వార్తా సంస్థ ఈ విషయాలన్నీ వెల్లడిస్తూ ఓ వార్తను ప్రచురించింది. పూర్వాపరాలు విచారించిన కోర్టు.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బ్లెస్సీ మరణించిందని తేల్చింది. ఇందుకు నష్టపరిహారంగా భార్యను కోల్పోయిన అబ్రహంకు రూ.39 లక్షల పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం మరో 2 లక్షల దీరమ్స్ (రూ.39.04 లక్షలు) చెల్లించాల్సిందిగా ఆసుపత్రి వైద్యులను ఆదేశించింది. బ్లెస్సీకి వైద్యం అందించిన డాక్టర్లు దర్శన్ ప్రభాత్ రాజారాం, పి. నారాయణకు ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com