5వ ఎడిషన్‌ క్రిక్‌ ఖతార్ చాంపియన్‌ షిప్‌ లీగ్‌ 2019 ప్రారంభం

- September 07, 2019 , by Maagulf
5వ ఎడిషన్‌ క్రిక్‌ ఖతార్ చాంపియన్‌ షిప్‌ లీగ్‌ 2019 ప్రారంభం

ఖతార్: 40 టీమ్‌లతో ఎడిషన్‌ క్రిక్‌ కతార్‌ ఛాంపియన్‌షిప్‌ లీగ్‌ 2019 ప్రారంభమయ్యింది. ఈ లీగ్‌ ఓపెనింగ్‌ సెర్మానీని ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. దోహా నుంచి 9 మంది ప్రముఖ సింగర్స్‌ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. మహేందర్‌ జలందారి, జావెద్‌ బజ్వా, మొహమ్మద్‌ మక్సూద్‌, వకాస్‌ అమ్జాద్‌, జునైద్‌ జంషెడ్‌ అలాగే పోయెట్‌ షౌకత్‌ అలి నాజ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్‌ఐక్యూ గ్రూప్‌ ఈ ఈవెంట్‌ని హోస్ట్‌ చేసింది. కాగా, 200 మంది వరకు ప్లేయర్స్‌ మరియు స్పెక్టేటర్స్‌ ఈ కార్యమ్రానికి హాజరయ్యారు. ఖతార్లో ప్రముఖ ఇండియన్‌ బిజినెస్‌ మేన్‌ అయిన ఎంఎస్‌ బుకారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి శుఉక్రవారం ఈ చాంపియన్‌ షిప్‌కి సంబంధించి మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌, క్వార్టర్‌, సెమీ ఫైనల్స్‌.. ఫైనల్స్‌.. ఇలా మ్యాచ్‌ల నిర్వహణ జరుగుతుంది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com