చైనా కు తెగేసి చెప్పేసిన భారత్
- September 08, 2019
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీకి భారత ప్రభుత్వం షాకిచ్చింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన వంటి అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాకిస్థాన్‌లో పర్యటించాలని చైనా మంత్రి నిర్ణయించారు. ఆ వెంటనే భారత్‌లోనూ ఆయన పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అయితే, వాంగ్ యీ షెడ్యూల్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తొలుత పాకిస్థాన్‌లో కనుక పర్యటించాలనుకుంటే ఇక భారత్ రావాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పింది. రెండు దేశాల్లోనూ వెంట వెంటనే పర్యటించాలనుకుంటే తాము అంగీకరించబోమని, షెడ్యూలును మార్చుకోవాలని భారత స్పష్టం చేసింది. రెండు దేశాల్లోనూ ఒకేసారి పర్యటిస్తే అది రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నిబంధన ఒక్క చైనాకే కాకుండా ఇరు దేశాల్లో పర్యటించాలనుకున్న అన్ని దేశాలకు ఇది వర్తిస్తుందని భారత్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







