యూట్యూబ్‌కు భారీ జరిమానా

- September 08, 2019 , by Maagulf
యూట్యూబ్‌కు భారీ జరిమానా

వాషింగ్టన్‌: యూట్యూబ్‌కు భారీ షాక్‌ తగిలింది. పెద్దమొత్తంలో జరిమానాను విధించింది. ఇందుకు కారణం చిన్నారుల వ్యక్తిగత డేటాను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా చోరీ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్‌కు చెందిన వీడియో వెబ్‌సైట్‌ యూట్యూబ్‌కు జరిమానా విధించింది. ప్రకటనల కోసం 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించాలనే ఆరోపణతో గూగుల్‌ సంస్థ రూ.1200కోట్లకుపైగా జరిమానా చెల్లించాలని యుఎస్‌ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ న్యూయార్క్‌ కోర్టులో కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలపై న్యూయార్క్‌ స్టేట్‌ అటార్నీ జనరల్‌, ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ విచారణ తర్వాత వ్యాపార ప్రయోజనాల కోసం వీటిని వినియోగించిందనే వాదనపై సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు గూగుల్‌ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌కు 136 మిలియన్‌ డాలర్లు, న్యూయార్క్‌ స్టేట్‌కు 34 మిలియన్‌ డాలర్లు మొత్తం 170 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఎఫ్‌టిసి చైర్మన్‌ జో సైమన్స్‌ ప్రకటించారు. గోప్యత ఉల్లంఘనల ఆరోపణపై ఫేస్‌బుక్‌పై ఈ సంవత్సరం ఎఫ్‌టిసి విధించిన 5 బిలియన్‌ డాలర్ల జరిమానాతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

అయితే యూట్యూబ్‌కు ఎఫ్‌టిసి విధించిన జరిమానాను వాషింగ్టన్‌లోని ఫెడరల్‌ కోర్టు ఆమోదించాల్సిఉంది. మరోవైపు గోప్యతా ఉల్లంఘనల ఆరోపణలతో గూగుల్‌ను జరిమానా విధించడం 2011 నుంచి మూడవ సారి అని, తాజా ఉల్లంఘన చాలా తీవ్రమైందని డెమొక్రాట్‌ కమిషనర్‌ రోహిత్‌ చోప్రా పేర్కొన్నారు. కాగా గూగుల్‌ సంస్థపై అనేక సందర్భాల్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అపహరించినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా వ్యవహారంలో కూడా గోప్యతకు సంబంధించిన విషయంలో గూగుల్‌ సంస్థ విఫలమైందని యుఎస్‌ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ ఆరోపించింది. గతేడాది గూగుల్‌ సంస్థ డిజిటల్‌ ప్రకటనల ద్వారా రూ.8లక్షల కోట్లకు పైగా అర్జించిందనే ఆరోపణలూ ఉన్న విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com