ప్రతిభావంతుడైన ‘హెల్మెట్ సంగీతకారుడు’ కోసం వెతుకుతున్న సౌదీలు
- September 09, 2019సౌదీ అరేబియా:సౌదీలో ఎంటర్టైన్మెంట్ విభాగానికి చెందిన ఓ అధికారి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరికైనా తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరాడు.హెల్మెట్ పెట్టుకొని వయొలిన్ వాయిస్తున్న ఆ వ్యక్తి వీడియో షేర్ చేసిన టర్కీ ఆల్ షేక్ అనే ఆ అధికారి.. 'వాంటెడ్ ఫర్ రియాద్ సీజన్' అంటూ క్యాప్షన్ తగిలించాడు.ఈ విషయమై టర్కీ ఆల్.. 'రియాద్ సీజన్ కోసం ట్యాలెంట్ ఉన్న వ్యక్తుల కోసం గాలిస్తున్నాం. ఈ హెల్మెట్ మ్యుజీషియన్ ట్యాలెంట్ చాలా బాగుంది. అందుకే అతని కోసం గాలిస్తున్నాం' అని చెప్పారు.ఈ హెల్మెట్ మ్యుజీషియన్.. తానే స్వయంగా ముందుకొచ్చి రియాద్ సీజన్లో పాల్గొనాలని ఆహ్వానించారు కూడా. అక్టోబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు జరిగే రియాద్ సీజన్ వేడుకల్లో అనేక రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఇది సౌదీలో జరిగే అతిపెద్ద వేడుకల్లో ఒకటి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ