తొలి సీమాంతర పెట్రోలియం పైప్‌లైన్‌ను ప్రారంభించిన ప్రధానులు
- September 11, 2019
దక్షిణాసియాలో తొలి సీమాంతర పెట్రోలియం పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని కే.పీ.శర్మ ఓలీ సంయుక్తంగా ప్రారంభించారు. భారత్‌లోని మోతీ హారీ, నేపాల్‌లోని ఆమ్లేఖ్‌గంజ్ మధ్య ఈ పైప్‌లైన్ నిర్మించారు. దీని పొడవు 60 కిలోమీటర్లు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఈ పైప్‌లైన్ ఇరుదేశాల మధ్య మైత్రికి నిదర్శనమన్నారు ప్రధాని మోదీ. దీని నిర్మాణంలో నేపాల్ ప్రభుత్వ సహకారం మరువలేనిదన్నారు. ఇరుదేశాల కృషి వల్లే ఈ చరిత్రాత్మక ప్రాజెక్ట్.. అనుకున్న సమయానికంటే ముందే పూర్తైందన్నారు మోదీ..
1996లోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. 2016లో మోదీ నేపాల్ పర్యటన తర్వాతనే ఇది కార్యరూపం దాల్చింది. ఈ ఏడాదిలో ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ అది కాలేదు. నేపాల్‌లోని పార్సా జాతీయ పార్క్‌లో చెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం జరిగింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







