దుబాయ్‌లో 5 రోజుల 'సౌదీ నేషనల్‌ డే' సెలబ్రేషన్స్‌ ప్రకటన

- September 11, 2019 , by Maagulf
దుబాయ్‌లో 5 రోజుల 'సౌదీ నేషనల్‌ డే' సెలబ్రేషన్స్‌ ప్రకటన

89వ సౌదీ నేషనల్‌ డే సందర్భంగా దుబాయ్‌లో స్పెషల్‌ ఈవెంట్స్‌ జరగనున్నాయి. విజిట్‌ దుబాయ్‌ డాట్‌ కామ్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అరేబియన్‌ గల్ఫ్‌ బ్యాక్‌రడాప్‌లో జెబిఆర్‌ బీచ్‌ వద్ద ఫైర్‌ వర్క్స్‌ షో వుంటుంది. మరోపక్క దుబాయ్‌ ఫెస్టివల్‌ సిటీ మాల్‌ వద్ద స్పెక్టకల్‌ ఆఫ్‌ ఫైర్‌ డిజైనింగ్‌, లేజర్‌ మరియు లైట్స్‌ షో సౌదీ ట్యూన్స్‌కి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి 23 వరకు ఇది అందుబాటులో వుంటుంది. సెప్టెంబర్‌ 19న బల్కీస్‌ ఫతియాత్‌ సిటీ వాక్‌ని నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 20న షమ్మా హమదాన్‌ షో ఏర్పాటు చేస్తున్నారు. బుర్జ్‌ ఖలీఫా కూడా ఈ వేడుకల్లో భాగమవుతోంది. సెప్టెంబర్‌ 23న సౌదీ ఫ్లాగ్‌ని బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శిస్తారు. సౌదీ నేషనల్‌ డే సందర్భంగా దుబాయ్‌లోని హోటల్స్‌ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com