భర్త స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన భారత మహిళ

భర్త స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన భారత మహిళ

కువైట్‌ సిటీ: ఓ ఇండియన్‌ మెయిడ్‌ భార్య, తన భర్త స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురయ్యింది. నిందితుడు, బాధితురాలిపై అత్యాచారం చేయడమే కాక, ఆ మొత్తం సంఘటనను మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. బాధితురాలి భర్త పని నిమిత్తం బయటకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు, బాధితురాలి భర్త పని ప్రదేశంలో కొలీగ్స్‌గా పోలీసులు పేర్కొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వద్ద పనిచేసే వ్యక్తి, తన ఇంటికి వచ్చి తన భార్యను దయనీయ స్థితిలో కనుగొన్నాడని, వెంటనే పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

Back to Top