కొత్త గ్రూప్‌ వాలంటీర్లకు బిఆర్‌సిఎస్‌ ట్రైనింగ్‌

కొత్త గ్రూప్‌ వాలంటీర్లకు బిఆర్‌సిఎస్‌ ట్రైనింగ్‌

బహ్రెయిన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ (బిఆర్‌సిఎస్‌) సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ ఫావ్‌జి అమిన్‌, కొత్తగా జాయిన్‌ అయిన వాలంటీర్స్‌కి స్వాగతం పలికారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు చేరిన వాంటీర్లను ఆయన అభినందించారు. మనామాలోని డిప్లమాటిక్‌ ఏరియాలోగల సొసైటీ హెడ్‌ క్వార్టర్స్‌లో ఈ మేరకు ఓ కార్యక్రమం జరిగింది. ఆయా రంగాల్లో అందించాల్సిన సేవలపై వాలంటీర్లకు పలు సూచనల్ని చేశారు. ప్రతి వాలంటీర్‌, తనకు అప్పగించిన పనిని పూర్తి బాధ్యతతో, నిబద్ధతతో నిర్వహించాలనీ, సమాజానికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు సెక్రెటరీ జనరల్‌ అమిన్‌.  

 

Back to Top