కాశ్మీర్ పై చర్చలు కుదరవన్న పాక్ విదేశాంగ మంత్రి...మధ్యవర్తిత్వం కోసం వెంపర్లాట
- September 12, 2019
ఇస్లామాబాద్: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయడాన్ని పాకిస్థాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వీలుచిక్కినప్పుడల్లా దీనిపై ఏదో ఒక చోట మాట్లాడుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు సాధ్యం కావని, మధ్యవర్తిత్వం కావాలని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహమూద్ ఖురేషీ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ) 42వ సదస్సు వేదికగా పాక్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అయితే, రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, చర్చల ద్వారా అవి పరిష్కారమవుతాయని ఐరాస పేర్కొంది. ఆ వ్యాఖ్యలను పాక్ మంత్రి ఉటంకిస్తూ చర్చల వల్ల ఫలితమేమీ ఉండదన్నారు.
'భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు, చర్చలు సాధ్యం కాని పని. ఇరు దేశాల ఉద్రిక్తతలు మధ్య వర్తిత్వం ద్వారానే అది పరిష్కారమవుతాయి' అని ఖురేషీ అన్నారు. భారత్ మాత్రం ఈ విషయంలో ఎప్పటి నుంచో స్పష్టతతో ఉంది. అంతర్జాతీయ సమాజం కూడా కశ్మీర్ అంశాన్ని భారత్ అంతర్గత వ్యవహారంగానే పరిగణిస్తోంది. పాక్ మాత్రం మూడో వ్యక్తి ప్రమేయాన్ని కోరుతోంది.
ఇటీవల జరిగిన యూఎన్హెచ్ఆర్సీ సదస్సులో పాక్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. కశ్మీర్ పరిస్థితులపై ఈ మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలన్న పాక్ డిమాండ్‌ను భారత్ తోసిపుచ్చింది. ఇది భారత్ అంతర్గత వ్యవహారమని, ఇతరుల జోక్యాన్ని ఆమోదించబోమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన