'దేవినేని' లో కోటి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల
- September 12, 2019ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవినేని'. 'బెజవాడ సింహం' అన్నది ఉపశీర్షిక. నందమూరి తారకరత్న టైటిల్ రోల్లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బెజవాడలో ఇద్దరు మహనాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబనేపథ్యంలో సెంటిమెంట్‌ను జోడిస్తూ నడిచే ఈ సినిమాలో బెజవాడలోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983లో విజయవాడ ఫస్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె ఎస్ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో చేసిన అందరు నటీనటులు చాలా బాగా నటించారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, నందమూరి తారకరత్న నిజమైన దేవినేని నెహ్రుగా పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. సురేష్ కొండేటి వంగవీటి రంగా పాత్రలో మిమ్మల్ని అలరించనున్నాడు. అలాగే సురేంద్ర పాత్రలో ఏంఎన్ఆర్ చౌదరి నటిస్తున్నారు. దేవినేని మురళిగా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగతా పాత్రలో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, దృవతారలు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరిపేట హైవేలో భారీగా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
కోటి మాట్లాడుతూ.. ''నా కెరీర్లో ఇది సెకండ్ ఫేజ్. సంగీత దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు రాణించాను. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మీ ముందుకు రాబోతున్నాను. శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నాకు చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలి అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983తో రాజ్ కోటిగా నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ టైములో కె ఎస్ వ్యాస్గారు విజయవాడకి ఫస్ట్ పవర్ఫుల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ నేను చేయడం అనేది రేర్ ఇన్సిడెంట్. శివనాగుగారు వండర్ ఫుల్ డైరెక్టర్. ఈ క్యారెక్టర్‌తో మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'' అన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు