షార్‌లో హై అలర్ట్‌

- September 13, 2019 , by Maagulf
షార్‌లో హై అలర్ట్‌

నెల్లూరు : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బంగాళాఖాతంలో 50 నాటికల్ మైళ్ళ మేర సీఐఎస్ఎఫ్, మెరైన్ పోలీసుల విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షార్‌ తీరంలో తిరిగే పడవలపై మరింత నిఘా పెట్టారు. తీర ప్రాంతంలో రోజూ కన్న మరింత ఎక్కువ బలగాలను మోహరించిన గస్తీని కట్టుదిట్టం చేశారు.  మరోవైపు శ్రీహరికోట మొదటి, రెండో గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. కొత్తవారి కదలికలపై నిఘా ఉంచారు. శ్రీహరికోట సమీపంలోని అడవుల్లో బలగాలు కూంబింగ్‌ చేపట్టారు. అలాగే రొట్టెల పండుగ సందర్భంగా వేనాడు దర్గాకు వచ్చే వాహనాల తనిఖీలు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే  ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.
Attachments area

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com