నీరవ్ సోదరుడు నేహాల్‌మోడీ పై రెడ్‌కార్నర్ నోటీస్!
- September 13, 2019
పంజాబ్ నేషనల్‌బ్యాంకులో 13వేల కోట్ల రుణపరపతి కుంభకోణాలకు సంబంధించి నిందితునిగా ఉన్న వజ్రాభరణాల వ్యాపారి నీరవ్‌మోడీ సోదరుడు నేహాల్‌మోడీ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసింది. బెల్జియం దేశస్తునిగా ఉన్న 40ఏళ్ల నేహాల్‌పై గ్లోబల్ అరెస్టు వారంట్ జారీ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై ఇడి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నేహాల్ దీపఖ్‌మోడీ బెల్జియంలోని యాంట్వెర్ప్‌లో జన్మించారు. ఆయనకు ఇంగ్లీషు, గుజరాతి, హిందీ భాషలు వచ్చని రెడ్‌కార్నర్ నోటీస్‌లో వివరించారు. ఇడి అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీటులో నేహాల్ మోడీపేరును కూడా చేర్చారు. అంతేకాకుండా ఆయన సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్రలు చేసారని ఆరోపించింది. నీరవ్‌మోడీతో పాటు ఆయన మేనమామ మెహుల్‌చోక్సీని కూడా ఈ భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రదారులు, నిందితులుగా ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. సుమారు 14వేల కోట్లమేరకు తమ బ్యాంకు నష్టపోయిందని పంజాబ్‌నేషనల్‌బ్యాంకు వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







