ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక
- September 14, 2019
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నియమావళిని ఉల్లంఘిస్తే ‘పునరుద్ధరణకు వీలులేని ఇంక్రిమెంట్‌ను నిలుపుదల’ శిక్షగా పడుతుంది. క్రమశిక్షణా చర్యల కింద నియామకాధికారి ఈ శిక్ష విధించే అవకాశం ఉంది. విధుల్లో తప్పులు చేసేవారికి తేలికపాటి శిక్షలు (మైనర్ పెనాల్టీస్), కఠిన శిక్షలు (మేజర్ పెనాల్టీస్) ఉంటాయి. చేసిన తప్పుల తీవ్రత, ప్రభావం చూసిన అంశాలను పరిగణలోనికి తీసుకుని శిక్షలు అమలు చేస్తారు. ఉద్యోగి నేర తీవ్రత ఎక్కువగా ఉంటే విధించే అతి కఠిన శిక్షల్లో పునరుద్ధరణకు వీలులేని ఇంక్రిమెంట్‌ను నిలుపుదల (స్టాప్ ఏజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ విత్ క్యుములేటీవ్ ఎఫెక్ట్) ఒకటి. ఈ శిక్ష పడిన ఉద్యోగికి వార్షిక ఇంక్రిమెంట్‌ను ఒకటి లేదా రెండు సంవత్సరాల వరకు పునరుద్ధరణకు వీలులేకుండా నిలిపివేయవచ్చు. అంటే శిక్షకు గురైన ఉద్యోగి శాశ్వతంగా ఈ ఇంక్రిమెంట్ కోల్పోతాడు. శిక్ష పడిన ఉద్యోగులకు అన్ని అర్హతలు ఉన్నా ఎన్ని సంవత్సరాలపాటు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తే.. అంతకు రెట్టింపు సంవత్సరాలు పదోన్నతి పొందే వీలు ఉండదు. పీఆర్‌సీ అమలు చేసే సమయంలో మిగతావారి కన్నా శిక్ష పడిన ఉద్యోగులకు పే ఫిక్సెషన్ తక్కువగా నిర్ధారిస్తారు. పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఫ్యామిలీ పెన్షన్ శిక్ష పడిన ఉద్యోగులకు తక్కువగా నిర్ధారిస్తారు. ఇలాంటి కాల పరిమితి శిక్షలన్నీ తప్పు చేసిన ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి వర్తిస్తాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







