నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
- September 14, 2019
ఏపీలోని నిరుద్యోగ యువతకు 6 ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NFDC) ముందుకొచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్ కార్పోరేషన్‌తో కలిసి ఈ సంస్ధ పనిచేయనుంది. శిక్షణలో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగులకు యానిమేషన్, గ్రాఫిక్స్, డిజైన్, అసిస్టెంట్ కెమెరామెన్, డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కోర్సుకు 30 మందిని ఎంపిక చేసి మొత్తం 6 కోర్సుల్లో 180 మందికి శిక్షణ ఇస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి మూడు నెలలపాటు శిక్షణ అందిస్తారు. అనంతరం వీరికి ఉపాధి అవకాశాలను కూడా NFDC కల్పిస్తుంది.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్