దుబాయ్-మస్కట్: రోడ్డు ప్రమాదంలో వరంగల్ కు చెందిన కుటుంబం మృతి
- September 16, 2019
దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ఓ నాలుగేళ్ళ చిన్నారి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్‌కు చెందిన గౌస్‌ఉల్లా ఖాన్(30) నగరంలోని టోలిచౌకీలో ఉంటూ ఉద్యోగరీత్యా యూఏఈ వెళ్ళాడు. కాగా, ఇతడు శుక్రవారం ఉల్లాఖాన్‌తో పాటు భార్య అయేషా (30), కుమారుడు హమ్జ (8 నెలలు), కుమార్తె హానియా సిద్ధిఖి(3)లతో కలసి దుబాయ్ సలాల హైవే మీదుగా మస్కట్‌కు కారులో బయల్దేరి వెళ్తున్నాడు. అయితే ఎదురుగా వస్తున్న వాహనం వీరి కారును ఢీకొట్టడంతో గౌస్‌ఉల్లా, అయేషా, హమ్జలు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కుమార్తె హానియాను చికిత్స నిమిత్తం దుబాయ్‌లోని కౌలా ఆస్పత్రిలో పోలీసులు చేర్పించారు. కాగా సమాచారం అందుకున్న గౌస్ఉల్లాఖాన్ కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం మస్కట్‌కు వెళ్ళారు. ఆదివారం ఉదయం మృతదేహాలను నగరానికి తీసుకువస్తారని తెలిసింది. కాగా, ఆదివారం టోలిచౌకీ సాలార్జంగ్ కాలనీలోని మజ్జీద్ ఎ సాలార్‌జంగ్‌లో మధ్యాహ్నం 1ః30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







