శృతి లయల సమ్మోహనం –కువైట్ లోని తెలుగు ప్రజల ఆనందోత్సవం

- September 17, 2019 , by Maagulf
శృతి లయల సమ్మోహనం –కువైట్ లోని తెలుగు ప్రజల ఆనందోత్సవం

 

కువైట్: తెలుగు ప్రజల సంసృతిని సాంప్రదాయాల్ని పరిరక్షించుకొవడం తెలుగుకళల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటడమే ప్రధానోద్దేశ్యంగా ఏర్పాటైన తెలుగు కళా సమితి- కువైట్ అధ్వర్యంలో 13సెప్టెంబర్ (శుక్రవారం) నాడు కువైట్ లోని కేంబ్రిడ్జ్ స్కూలు ఆడిటోరియంలో జరిగిన శృతి-లయలు నృత్యగాన కార్యక్రమం ఆహుతుల్ని ఎంతగానో అలరించింది. తిరుమల వెంకటేశ్వరుని స్తుతిస్తూ అన్నమయ్య కీర్తనలు, దశావతారాలు, భామాకలాపంతో అలరించే కూచిపూడి నృత్యాలతో సాగిన కార్యక్రమాన్ని కువైట్ లోని తెలుగు ప్రజలు అంతా తన్మయత్యంతో వీక్షించారు. కూచిపూడి నాట్యాన్ని ప్రపంచం అంతటా ప్రదర్శిస్తూ అనేక వేల ప్రదర్శనలు ఇచ్చిన “గురు వేదాంతం రాధేశ్యాం”  భామాకలాపం నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. తిరుమలక్షేత్రంలో “శ్రీవారి ఆస్థాన విద్వాంసుడు” ఆలూరు రాజమోహన్ తన గానామృతంతో గోవిందనామాలతో ఆడిటోరియంలోని వారిని భక్తి పారవశ్యంలో ఓలలాడించారు. ఇలాంటి ప్రదర్శన తన అద్వర్యంలో జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉంది అని తెలుగుకళాసమితి-కువైట్ ప్రెసిడెంట్ వై వి భాస్కరరెడ్డి  తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన మాజీ ప్రెసిడెంట్  దరూరు బలరాం నాయుడు మరియు డాన్స్ టీచర్  సునీతలకు అయన కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ అద్భుతమైన సాంస్కృతిక కళాప్రదర్శనకు ప్రధాన స్పాన్సర్ గా సహాయ సహకారాలు అందించిన శుభోదయం ఇన్ఫ్రా చైర్మన్ డా. కలపటపు లక్ష్మీ ప్రసాద్ ని మరియు కళాకారులను తెలుగు కళాసమితి కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఇలాంటి మంచి కార్యక్రమాలకు తనవంతు సహకారాన్ని అందించే అవకాశం వచ్చినందుకు, తెలుగుదనాన్ని ఎడారి దేశం అయిన కువైట్ లో తెలుగు కళాసమితి సజీవంగా కాపాడుతున్నందుకు ఆనందంగా ఉందని  డా.లక్ష్మీ ప్రసాద్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే తమ సంస్థ "శుభోదయం ఇన్ఫ్రా"  సహాయ సహకారాలు తెలుగు కళా సమితికి ఎప్పుడూ ఉంటాయి అని తెలియజేశారు.ఈ సందర్భంగా వారు నిర్మిస్తున్న "ఘంటసాల" చిత్రం యొక్క ప్రచార చిత్రం కువైట్ లో మొట్టమొదటి సారి ప్రదర్శించడం తెలుగు కళా సమితి కువైట్ కి దక్కిన గౌరవం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com