హౌదీ-మోదీ: తన ప్రసంగానికి ప్రజలు సలహాలు, సూచనలు అందించాలని కోరిన మోదీ
- September 17, 2019
అమెరికాలోని హ్యూస్టన్ వేదికగా జరగబోయే 'హౌదీ-మోదీ' కార్యక్రమానికి ఎంతో ఆత్రతుగా చూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగానికి సంబంధించి దేశ ప్రజలు సలహాలు, సూచనలు అందించాలని ట్విటర్ వేదికగా కోరారు. ''22న హ్యూస్టన్లో జరగబోయే హౌదీ-మోదీ కార్యక్రమం కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నాను. ఆరోజున నేనేం మాట్లాడాలో మీ ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకు సలహాలు, సూచనలు ఇవ్వండి. నా ప్రసంగంలో నేను వాటిని ప్రస్తావిస్తాను. నమో యాప్‌లోని స్పెషల్ ఫోరం ద్వారా మీ ఆలోచనల్ని పంచుకోండి'' అని ట్విటర్‌లో మోదీ కోరారు.
హ్యూస్టన్‌లో భారతీయ అమెరికన్లు నిర్వహించనున్న 'హౌదీ మోదీ' కార్యక్రమంలో ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వేదిక పంచుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు అక్కడి భారతీయ అమెరికన్లనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరు కానున్నారు. అనంతరం ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మోదీ ఈనెల 27న ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







