ఒమన్ కుటుంబం హత్య కేసులో భారత జాతీయుడి అరెస్ట్
- September 18, 2019
అహ్మదాబాద్: ఒమన్ కుటుంబాన్ని హత్య చేశాడనే అనుమానంతో ఓ భారత జాతీయుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), నిందితుడ్ని అహ్మదాబాద్‌లో అరెస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ పోలీస్ ఛానెల్స్, ఇంటర్‌పోల్ ఇచ్చిన నోటీసు మేరకు భారత పోలీసు యంత్రాంగం స్పందించి, నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒమన్‌లో వాంటెడ్ పీపుల్స్ లిస్ట్‌లో నిందితుడు వున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య కేసులో నిందితుడిపై అభియోగాలున్నాయి. మృతిచెందినవారిలో 12 ఏళ్ళు, తమ్మిదేళ్ళు, ఆరేళ్ళ వయసున్న చిన్నారులూ వున్నారు. ఒమన్ అథారిటీస్, నిందితుడికి సంబంధించిన వివరాల్ని భారత పోలీసులకు అందించడంతో, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







