ETCA మరియు UAE జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల ఫ్లైయర్ విడుదల
- September 18, 2019
యూ.ఏ.ఈ:ETCA మరియు UAE జాగృతి సంయుక్తంగా నిర్వహిస్తున్న తొమ్మిదవ బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఫ్లైయర్ ఆవిష్కరణ మంగళవారం 17 సెప్టెంబర్ 2019 రోజున ETCA ప్రెసిడెంట్ సత్యం రాధారపుమరియు ప్రముఖ వ్యాపార వేత్త తోట రామ్ కుమార్ చేతులమీదుగా జరిగింది.
ఈ సమావేశంలో వచ్చే నెలలో జరగబోయే బతుకమ్మ సంబరాలకు సంబంధించిన కార్యక్రమ విశేషాలను ఉద్దేశించి అధ్యక్షులు సత్యం రాధారపు గారు మరియు ఈటీసీఎ వ్యవస్థాపక అధ్యక్షులైన కిరణ్ కుమార్ పీచర గారు మాట్లాడుతూ గత సంవత్సరాల్లో కంటే కూడా ఈ సంవత్సరం మరింత గొప్పగా నిర్వహించడానికి సంఘం పటిష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉందని, అందుకు గాను సభ్యులకు శాఖల వారీగా బాధ్యతలను అప్పగించడం జరిగిందని తెలిపారు. షార్జా లోని స్కై లైన్ యూనివర్సిటీని వేదికగా చేస్కొని అక్టోబర్ 04 శుక్రవారం రోజున సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, సుమారు 10000 మంది భారీ జన సమీకరణ నడుమ తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా జరుగుతాయని వెల్లడించడం జరిగింది.
ఈ సంబరాల్లో అందమైన బతుకమ్మల పోటీలు నిర్వహించబడునని, UAE లో ఉంటున్న అందరు తెలంగాణ ప్రవాసులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో UAE కి సంబంధించిన ప్రముఖ తెలంగాణ వ్యాపారవేత్తలు మసీఉద్దిన్ మొహమ్మద్, రాంచందర్ రెడ్డి, గబ్బుల బాలయ్య, గోవర్ధన్ రెడ్డి, కిష్టయ్య , జయంత్ రెడ్డి, శంకర్ , సుధాకర్ రెడ్డి, వేణు , ఇర్షాద్, ప్రతాప్, వంశీ, మురళీ, పిట్టల రాజయ్య మరియు ETCA వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచర, అరవింద్ రాగం, భరద్వాజ్ వాల, నరేష్ కుమార్ మాన్యం, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..