మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ కు తీవ్ర అస్వస్థత..!
- September 19, 2019సినీ నేపథ్యం నుంచి వచ్చి రాజకీయాల్లో తన సత్తా చాటారు చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్. 2009,2014 లలో చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు. తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు.
ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించాడు. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ ను వారంక్రితం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు. గత పది సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో రకాల వేషాలు వేసి రక రకాల నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా శివ ప్రసాద్ పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఇవ్వాళ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి