కొత్త లొకేషన్‌కి మారిన మవసలాట్‌ బస్‌ స్టేషన్‌

- September 21, 2019 , by Maagulf
కొత్త లొకేషన్‌కి మారిన మవసలాట్‌ బస్‌ స్టేషన్‌

మస్కట్‌:మవసలాట్‌ కొత్త బస్‌ స్టేషన్‌ బుర్స్‌ అల్‌ సహ్వాకి కొత్తగా లొకేషన్‌ మార్చింది. ఈ మేరకు మవసలాత్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ బస్సుల పార్కింగ్‌ ఏరియాని మరింత అనువైన ప్రాంతంలోకి మార్చినట్లు పేర్కొంది. బుర్జ్‌ అల్‌ సహ్వాలో కార్యకలాపాలు సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ లొకేషన్‌ నుంచి ఆపరేట్‌ అయ్యే కొత్త రూట్‌ వివరాల్ని కూడా మవసలాట్‌ వెల్లడించింది. అల్‌ ఖౌద్‌ - ఎస్‌క్యుయు - బుర్స్‌ అల్‌ సహ్వా, అల్‌ మాబిలా - ఖౌద్‌ - బుర్జ్‌ అల్‌ సహ్వా, అల్‌ మావాలిహ్‌ నార్త్‌ - అల్‌ ఖువైర్‌, అల్‌ మాబిలా - సీప్‌ సౌక్‌ - అల్‌ మావిలా సౌత్‌ - బుర్జ్‌ అల్‌ సహ్వా, బుర్జ్‌ అల్‌ సహ్వా - అల్‌ కువైర్‌ మరియు ఇంటర్‌సిటీ రూట్స్‌ ఇక్కడి నుంచి సేవలందిస్తాయి.

stop support to terror groups: UAE Tells Qatar
తీవ్రవాదానికి మద్దతు ఆపాల్సిందే: ఖతార్‌కి తేల్చి చెప్పిన యూఏఈ
తమ జాతీయ మీడియా ద్వారా విద్వేష ప్రచారాన్ని ఖతార్‌ మానుకోవాలని యూఏఈ సూచించింది. అలాగే తీవ్రవాదానికి మద్దతును ఖతార్‌ ఉపసంహరించుకోవాలని యూఏఈ డిమాండ్‌ చేసింది. యూఎన్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ముందు యూఏఈ తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టింది. కౌన్సిల్‌లో యూఏఈ రిప్రెజెంటేటివ్‌ అయిన అమిరా అల్‌ అమిరి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. టెర్రర్‌ గ్రూపుల విషయంలో ఖతార్‌ ఇల్లీగల్‌గా వ్యవహరిస్తోందని యూఏఈ ఆరోపించింది. అమిరా మాట్లాడుతూ, ఖతార్‌, తీవ్రవాద సంస్థలకు అందిస్తోన్న ఆర్థిక సహాయాన్ని ఇకపై ఆపేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా యూఎన్‌ రైట్స్‌ కౌన్సిల్‌, ఖతార్‌ తన యాక్టివిటీస్‌పై రివ్యూ చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చింది.

year of tolerance, 250 art works exhibited
టోలరెన్స్‌పై 250 ఆర్ట్‌ వర్క్స్‌ ప్రదర్శన
100 మందికి పైగా ఆర్టిస్టులు ఇయర్‌ ఆఫ్‌ టోలరెన్స్‌ సందర్భంగా తమ ఆర్ట్‌ వర్క్స్‌ని జుమైరాలోని ప్రదర్శించారు. ఇయర్‌ ఆఫ్‌ టోలరెన్స్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ని 2ఎక్స్‌ఎల్‌ ఫర్నిచర్‌ మరియు హోడ్‌ డెకార్‌ ఏర్పాటు చేసింది. బ్రెజిల్‌ రాయబారి ఫెర్నాండో లూయిస్‌ లెమస్‌ ఇగ్రెజా, దుబాయ్‌లో ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌, దుబాయ్‌ కల్చర్‌ మరియు ఆర్ట్స్‌ అథారిటీ నుంచి ఎమిరేటీ ఆర్టిస్టులు అల్‌రయిస్‌ మరియు ఖలీల్‌ అబ్దుల్‌వాహిద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 2ఎక్స్‌ఎల్‌ ఫర్నిచర్‌ మరియు హోమ్‌ డెకార్‌ మార్కెటింగ్‌ హెడ్‌ అమిత్‌ యాదవ్‌ మాట్లాడుతూ, ఇండియాతోపాటు మెక్సికో, బ్రెజిల్‌, రష్యా, ఇరాన్‌ తదితర ప్రాంతాల నుంచి ఆర్టిస్టులు వచ్చారనీ, అద్భుతమైన తమ కళాకృతుల్ని ప్రదర్శించారని చెప్పారు. ఆరు నెలల క్రితమే ఆర్టిస్టులకు థీమ్‌ అందించారు. పీస్‌, టోలరెన్స్‌, హార్మోని విభాగాలపై ఆర్టిస్టులు తమ ఆర్ట్‌ వర్క్‌ని రూపొందించారు. పీస్‌ అంబాసిడర్‌ అయిన మహాత్మాగాంధీపై లైవ్‌ పెయింటింగ్‌ సెషన్‌ కూడా నిర్వహించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com