టోలరెన్స్‌పై 250 ఆర్ట్ వర్క్స్ ప్రదర్శన
- September 21, 2019
దుబాయ్:100 మందికి పైగా ఆర్టిస్టులు ఇయర్ ఆఫ్ టోలరెన్స్ సందర్భంగా తమ ఆర్ట్ వర్క్స్‌ని జుమైరాలోని ప్రదర్శించారు. ఇయర్ ఆఫ్ టోలరెన్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ని 2ఎక్స్‌ఎల్ ఫర్నిచర్ మరియు హోడ్ డెకార్ ఏర్పాటు చేసింది. బ్రెజిల్ రాయబారి ఫెర్నాండో లూయిస్ లెమస్ ఇగ్రెజా, దుబాయ్‌లో ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్, దుబాయ్ కల్చర్ మరియు ఆర్ట్స్ అథారిటీ నుంచి ఎమిరేటీ ఆర్టిస్టులు అల్‌రయిస్ మరియు ఖలీల్ అబ్దుల్‌వాహిద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 2ఎక్స్‌ఎల్ ఫర్నిచర్ మరియు హోమ్ డెకార్ మార్కెటింగ్ హెడ్ అమిత్ యాదవ్ మాట్లాడుతూ, ఇండియాతోపాటు మెక్సికో, బ్రెజిల్, రష్యా, ఇరాన్ తదితర ప్రాంతాల నుంచి ఆర్టిస్టులు వచ్చారనీ, అద్భుతమైన తమ కళాకృతుల్ని ప్రదర్శించారని చెప్పారు. ఆరు నెలల క్రితమే ఆర్టిస్టులకు థీమ్ అందించారు. పీస్, టోలరెన్స్, హార్మోని విభాగాలపై ఆర్టిస్టులు తమ ఆర్ట్ వర్క్‌ని రూపొందించారు. పీస్ అంబాసిడర్ అయిన మహాత్మాగాంధీపై లైవ్ పెయింటింగ్ సెషన్ కూడా నిర్వహించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







