తీవ్రవాదానికి మద్దతు ఆపాల్సిందే: ఖతార్‌కి తేల్చి చెప్పిన యూఏఈ
- September 21, 2019
యూ.ఏ.ఈ:తమ జాతీయ మీడియా ద్వారా విద్వేష ప్రచారాన్ని ఖతార్ మానుకోవాలని యూఏఈ సూచించింది. అలాగే తీవ్రవాదానికి మద్దతును ఖతార్ ఉపసంహరించుకోవాలని యూఏఈ డిమాండ్ చేసింది. యూఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు యూఏఈ తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టింది. కౌన్సిల్లో యూఏఈ రిప్రెజెంటేటివ్ అయిన అమిరా అల్ అమిరి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. టెర్రర్ గ్రూపుల విషయంలో ఖతార్ ఇల్లీగల్‌గా వ్యవహరిస్తోందని యూఏఈ ఆరోపించింది. అమిరా మాట్లాడుతూ, ఖతార్, తీవ్రవాద సంస్థలకు అందిస్తోన్న ఆర్థిక సహాయాన్ని ఇకపై ఆపేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా యూఎన్ రైట్స్ కౌన్సిల్, ఖతార్ తన యాక్టివిటీస్‌పై రివ్యూ చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!