కోల్ ఇండియాలో ఉద్యోగావకాశాలు
- September 21, 2019
కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) కొలువుల జాతరను ప్రకటించింది. త్వరలోనే కోల్ ఇండియా 9000 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని సమాచారం. కోల్ ఇండియా పరిధిలోని 8 సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులను సంస్థ భర్తీ చేయనుండగా.. కార్మికులు, టెక్నికల్ ఉద్యోగాల భర్తీని సబ్సిడరీ కంపెనీలు చేపడతాయి. ఈ డైవ్ ద్వారా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీ కోసం కోల్ ఇండియా ఎక్కువ సంఖ్యలో ఎగ్జిక్యూటివ్‌లను నియమించనుంది.
4000 ఖాళీలు ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులలో 900 పోస్టులను ప్రకటనలు, ఇంటర్వ్యూ ద్వారా, 2200 పోస్టులను పోటీ పరీక్షల ద్వారా, 400 పోస్టులను క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా, మిగతా పోస్టులను వేర్వేరు విధానాల్లో భర్తీ చేయనున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ప్రధానంగా కార్మికులు, టెక్నికల్ పోస్టులు కలిపి మొత్తం 5000 ఖాళీలను సంస్థ నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నారు. వీటిలో 2300 పోస్టులను కోల్ ఇండియా ప్రాజెక్టుల కారణంగా భూమిని కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల్లోని వ్యక్తులతో భర్తీ చేయనుంది. ఇక 2350 పోస్టులకు కారుణ్య నియామకాలు చేపట్టనున్నారు. భారత్‌లో రైల్వేల తరువాత అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్న పబ్లిక్ సెక్టార్ సంస్థగా కోల్ ఇండియా నిలిచిందని ఎకనామిక్ టైమ్స్ వివరించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!