'హౌడీ మోడీ'లో జాతీయ గీతం పాడనున్న భారతీయ సంతతి టీన్

- September 22, 2019 , by Maagulf
'హౌడీ మోడీ'లో జాతీయ గీతం పాడనున్న భారతీయ సంతతి టీన్

అమెరికా:హౌడీ మోదీ కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. అతని పేరు స్పర్శ్ షా. 16 ఏళ్ల స్పర్శ్, హౌడీ మోదీ మీటింగ్‌లో జాతీయ గీతాన్ని ఆలపించనున్నాడు. ఓ యువకుడు జాతీయ గీతాన్ని ఆలపించడం పెద్ద విశేషమేమీ కాదు కానీ, స్పర్శ్ మాత్రం అందుకు మినహాయింపు. ఇతను వికలాంగుడు. అరుదైన వ్యాధి కారణంగా స్పర్శ్ నడవలేడు. ఈ వైకల్యాన్ని నిర్వాహకులు పట్టించుకోలేదు. అతని ప‌్రతిభకే పెద్ద పీట వేశారు. మోదీ మీటింగ్‌లో నేషనల్ ఆంథెమ్‌ను పాడే అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశంపై స్పర్శ్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీని కలుసుకునే ఛాన్స్ రావడం తనకెంతో గొప్ప విషయమని చెప్పాడు.

ప్రస్తుతం స్పర్శ్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నాడు. అతను పుట్టుకతోనే ఆస్టియోజెన్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే 35 ఎముకలు విరిగిపోయాయి. మొత్తంగా స్పర్శ్ శరీరంలో 130కి పైగా ఎముకలు విరిగిపోయాయి. దాంతో అతను స్పర్శ్ నడవలేడు. ఐనప్పటికీ స్పర్శ్ వెనక్కి తగ్గలేదు. వైకల్యాన్ని అధిగమించి వివిధ రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శించాడు. సింగర్‌గా, రచయితగా, మోటివేషనల్ స్పీకర్‌గా పేరు సంపాదించాడు. 2018 బ్రిటల్ బోన్ రేపర్ అనే పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీలో స్పర్శ్ షాహ్ జీవితాన్ని చూపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com