వలసకార్మిక నాయకులకు ఢిల్లీలో శిక్షణ

- September 22, 2019 , by Maagulf
వలసకార్మిక నాయకులకు ఢిల్లీలో శిక్షణ

తెలంగాణ:ఈనెల 23 నుండి 26 వరకు నాలుగు రోజులపాటు ఢిల్లీ సమీపంలోని నోయిడాలోని వివి గిరి నేషనల్ లేబర్ ఇన్ స్టిట్యూట్ లో జరిగే కార్మిక నాయకులకు సామర్థ్య పెంపుదల శిక్షణా కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన స్వదేశ్ పరికిపండ్ల, జగిత్యాల జిల్లాకు చెందిన సయిండ్ల రాజిరెడ్డి లు పాల్గొంటున్నారు. గల్ఫ్ వలసకార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేస్తున్న వీరికి "వలసలు మరియు అభివృద్ధి: సమస్యలు, ధృక్కోణాలు" అనే అంశంపై దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోదనా సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన నిపుణులు శిక్షణ ఇస్తారు. 

వలసల పరిశోధన, విధానపరమైన అంశాలలో ఉద్భవించే సమస్యలను అధిగమించడానికి పరిశోధకులు, విధాన నిర్ణేతల సామర్థ్యాలను అభివృద్ధి చేస్తారు. వలసలకు సంబంధించిన భావాలు, సిద్ధాంతాలు అర్థం చేసుకోవడం, ప్రపంచీకరణ ఆర్ధికవ్యవస్థలో వలసలపై పోకడలు, నమూనాలు పరిశీలించడం ఈ శిక్షణ ఉద్దేశ్యం. వలసలు - అభివృద్ధికి మధ్య సంబంధాల అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉపన్యాసాలు, సంప్రదింపులు, చర్చలు, అధ్యయనాల ఉదాహరణల విధానంలో భోధన ఉంటుంది. సమకాలీన వలస విధానాలను చర్చించడం, వలసలకు అభివృద్ధికి గల  సంబంధాలను విశ్లేషిస్తారు.  

సయిండ్ల రాజిరెడ్డి

స్వదేశ్ పరికిపండ్ల

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com