కశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నం
- September 23, 2019
కశ్మీర్: కశ్మీర్లో పెను ప్రమాదం తప్పింది. ఉగ్ర కుట్న భగ్నమైంది. జమ్మూ కశ్మీర్లో మారణహోమం సృష్టించడానికి ఉగ్రవాదుల పన్నిన కుట్రను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. కథువా ప్రాంతంలోని దెవాల్ గ్రామం లో 40 కిలోల పేలుడు పదార్థాలను సైనిక దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
కశ్మీర్ లోయలో సైన్యంపై విరుచుకుపడడానికి ఉగ్రవాదులు ప్రణాళిక రచిస్తున్నాయని కొన్ని రోజులుగా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల ఐబీ నుంచి సైన్యానికి మరోసారి విశ్వసనీయమైన సమాచారం అందింది. దాంతో సైనిక బలగాలు, కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అనుమానిత ప్రాంతంలో గాలింపు జరిపారు. ఈ సోదాల్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు దేశీయంగా తయారు చేసినవేనని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







