పాకిస్థాన్లో భారీ భూకంపం..3 మృతి, 50 కు పైగా మందికి గాయాలు
- September 24, 2019
పాకిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇస్లామాబాద్, అజద్ కశ్మీర్, పెషావర్, రావల్పిండి, లాహోర్ పట్టణాల్లో భూకంపంతో రహదారులు దెబ్బతిన్నాయి. పీవోకేలోని మీర్పూర్లో ఓ భవనం కుప్పకూలింది. వివిధ ప్రాంతాల్లో ముగ్గురు మృతి, సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని పీవోకేలోని ఆస్పత్రులకు తరలించారు. భూప్రకంపనలతో భవనాల్లో నుంచి భయంతో పరుగులు తీసినట్లు ప్రత్యక్షసాక్షులు మీడియాతో చెప్పారు. భూకంపంతో మీర్పూర్లోని రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా వాహనాలు బోల్తా పడ్డాయి. పంజాబ్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన జెహ్లామ్ పట్టణానికి సమీపంలో..10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదైనట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఢిల్లీలో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







