అబుదాబీలో ట్యాక్సీ స్టాండ్లుగా మారనున్న 40 బస్‌ స్టాప్స్‌

- September 24, 2019 , by Maagulf
అబుదాబీలో ట్యాక్సీ స్టాండ్లుగా మారనున్న 40 బస్‌ స్టాప్స్‌

అబుదాబీ ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేటర్స్‌, వినియోగంలో లేని 40 బస్‌ స్టాప్స్‌ని ట్యాక్సీ స్టాండ్లుగా మార్చుతున్నట్లు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌ (ఐటిసి) వర్గాలు ఈ విషయమై స్పందిస్తూ, అబుదాబీలో పార్కింగ్‌ మేనేజ్‌మెంట్‌కి ఇన్నోవేటివ్‌ సొల్యూషన్స్‌ చూపే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ట్యాక్సీ యూజర్స్‌కి ఈ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందని సంబంధిత వర్గాలు వివరించాయి. పలు బస్‌ రూట్‌లు మార్చడంతో ఈ 40 బస్‌ స్టాప్స్‌ వినియోగంలో లేకుండా పోతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఎమిరేట్‌లో 4,000 బస్‌స్టాప్స్‌ వున్నాయనీ, అందులో 2,000 బస్‌స్టాప్స్‌ క్యాపిటల్‌ ఏరియాలో వున్నట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com