కలెక్టర్ కార్యాలయంలో పరిహారం కోసం క్యూ కట్టిన వడ్డే నవీన్.!

- September 24, 2019 , by Maagulf
కలెక్టర్ కార్యాలయంలో పరిహారం కోసం క్యూ కట్టిన వడ్డే నవీన్.!

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల తనయుడు హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో దర్శక, నిర్మాత ఇతర టెక్నీషియన్, నటుల వారసులు కూడా వెండి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే కోవలోకి వస్తారు వడ్డే నవీన్. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు వడ్డే నవీన్. 'కోరుకున్న ప్రియుడు' సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ ఎక్కువగా ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించాడు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు వడ్డే నవీన్


కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి' వడ్డే నవీన్ కి బాగా పేరు తీసుకు వచ్చింది.  ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేక పోయాయి. సాధారణంగా హీరోగా నటించన వారికి సొసైటీలో ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. కానీ ఈ మద్య కొంత మంది హీరోలు ఎలాంటి డాంభికాలకు పోకుండా కామన్ మాన్ లా ఉంటు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా వడ్డే నవీన్ సామాన్యుడిలా క్యూ లైన్‌లో నిలబడి అధికారులను కలసుకున్న సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. 

కృష్ణా జిల్లా కె.మాధవరంలో తమ భూమికి సంబంధించిన వ్యవహారంలో నవీన్ ప్రభుత్వానికి అర్జీ అందించారు. తమ 18 ఎకరాల భూమికి సంబంధించిన పరిహారం ఇప్పించాలని తన వినతిపత్రంలో కోరాడు. 1973లో భూసంస్కరణల్లో భాగంగా తమ మామిడి తోటను తీసుకున్నారని, అయితే ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదని వివరించారు. దీనికి సంబంధించిన అన్ని పత్రాలను ఆయన అధికారులకు చూపించారు. అంతకుముందు, తనవంతు వచ్చేవరకు సామాన్య ప్రజల్లో ఒకడిగా వడ్డే నవీన్ క్యూ లైన్లో నిలబడటం విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com