దుబాయ్ కాలువ తీరాన పైకప్పు వాణిజ్య సముదాయాలు
- January 10, 2016
పట్టణ అభివృద్ధిలో భాగంగా దుబాయ్ కాలువ రెండు తీరాల వెంబడి వాణిజ్య ప్రయోజనాల కోసం నిధులను కేటాయించనున్నట్లు దుబాయ్ ఉప రాష్ట్రపతి , యు. ఎ. ఇ. ప్రధాన మంత్రి,. దుబాయ్ పాలకుడు, గౌరవ యువరాజు షేక్ మొహమ్మద్ రషీద్ అల్ మక్తొఉమ్ పేర్కొన్నారు. శనివారం ఆయన దుబాయ్ కెనాల్ ప్రాజెక్ట్ తనిఖీకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , 605,000 చదరపు మీటర్లు , 4.68 మిలియన్ చదరపు విస్తీర్ణంలో ఈ సముదాయాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 5,345 నివాస గృహాలను 943 హోటల్ గదులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే, కాలువ ముఖ ద్వారం వద్ద ' గేటు టవర్స్ వంతెనలు ' 300,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 3 స్థాయిల దుకాణ సముదాయాలను, 434 చిల్లర దుకాణాలను ఉంటాయిని అన్నారు. పై కప్పులో ' అల్ సఫా ' గ్రీన్ పార్కు ఉంటుందని , ఇక్కడ 5 నక్షత్రాల హోటల్ ను , హోటల్ అపార్టుమెంట్ , బ్రాండ్ అపార్టుమెంట్ ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







