సౌదీ అరేబియా:తొలిసారి టూరిస్ట్ వీసా జారీ చేయనుంది
- September 27, 2019
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా మొదటిసారిగా పర్యాటక వీసాలు జారీ చేయనుంది.
పర్యాటక రంగాన్ని పెంపొందించుకునే క్రమంలో భాగంగా సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా పర్యాకట వీసాలు జారీ చేయనుంది. 2030కెల్లా దేశ పర్యాటక రంగం ద్వారా అధిక ఆదాయాన్ని అర్జించే కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల చమురు బావులపై జరిగిన దాడుల్లో ఆదేశ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దాన్ని పర్యాటకం ద్వారా భర్తీ చేసుకోనుంది.
'అంతర్జాతీయ పర్యాటకులకు వీసా జారీ చేయనుండటం సౌదీ అరేబియా చరిత్రలో చారిత్రక ఘట్టం. సౌదీలోని పర్యాటక ప్రాంతాలను చూసి కచ్చితంగా ఆశ్యర్యానికి గురవుతారు. ప్రకృతి అందాలు, యునెస్కో గుర్తించిన ఐదు వారసత్వ ప్రదేశాలు పర్యాటకులను కచ్చితంగా కనువిందు చేస్తాయి' అని సౌదీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం నుంచి ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 49 దేశాల పౌరులు ఇందుకు అర్హులు. విదేశీయుల డ్రెస్ కోడ్ విషయంలోనూ సౌదీ కఠిన నిబంధనలను సడలించింది.సౌదీలోని రియాద్ అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. ఎడారిలో నిర్మించిన ఈ నగరం ఎత్తైన కట్టడాలు, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. ఈ కట్టడాలు, నిర్మాణాల కారణంగా అందరిని ఈ నగరం ఆకర్షిస్తోంది. దేశవిదేశాల నుంచి ఎక్కువ మంది పనులకు ఈ నగరానికి వస్తుంటారు. రియాద్ నగరం ఎందరికో ఉపాధిని కల్పిస్తోంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..