ఐఎస్ఎస్లో ప్రయోగాల్ని ప్రారంభించిన యూఏఈ ఆస్ట్రోనాట్
- September 27, 2019
యూఏఈ:హజా అల్ మన్సూరి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి చేరుకోగానే, అక్కడ తన ప్రయోగాల్ని ప్రారంభించారు. యూఏఈ టైమ్ ప్రకారం సెప్టెంబర్ 26 తెల్లవారుఝామున 2.12 నిమిషాలకు అల్ మన్సూరి ఐఎస్ఎస్ కేంద్రానికి చేరుకున్నారు. జోయుజ్ ఎంఎస్ 15 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారాయన. రష్యన్ కాస్మోనాట్ ఒలెగ్ స్క్రిపోచ్కా, యూఎస్ ఆస్ట్రోనాట్ జెస్సికా మీర్ కూడా ఆయనతోపాటు అంతరిక్షంలోకి వెళ్ళారు. ఉదయం ప్రార్థనలతో అల్ మన్సౌరి తన పనుల్ని ప్రారంభించినట్లు మొహమ్మద్ బిన్ రషీద్ స్సేన సెంటర్ పేర్కొంది.వారం రోజుల్లో అల్ మన్సౌరి తిరిగి భూమికి చేరుకుంటారు. ఈలోగా ప్రతిరోజూ, మైక్రో గ్రావిటీ ఇంపాక్ట్ సహా అనేక అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తారు. బ్రెయిన్ డిటిఐ, ఓస్టియాలజీ, మోటార్ కంట్రోల్, మైక్రో గ్రావిటీలో టైమ్ పర్సెప్షన్, ఫ్యూయిడిక్స్, డిఎన్ఎఎమ్ ఏజ్ వంటి వాటిపైనా ఆయన ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!