కువైట్:రాంటిడైన్‌, జెంటాక్‌ మందులపై నిషేధం

- September 27, 2019 , by Maagulf
కువైట్:రాంటిడైన్‌, జెంటాక్‌ మందులపై నిషేధం

కువైట్‌: డ్రగ్‌ అండ్‌ ఫుడ్‌ కంట్రోల్‌ ఎఫైర్స్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ - అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ అబ్దుల్లా అల్‌ బాదెర్‌, దేశం నుంచి రాంటిడైన్‌, జాంటాక్‌ మందుల్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో వున్న మందుల్ని, వెనక్కి రప్పిస్తున్నట్లు చెప్పారు. వీటిల్లో క్యాన్సర్‌ కారకాలున్నాయని తేలిన దరిమిలా, ప్రపంచ వ్యాప్తంగా ఈ మందుని వినియోగించకూడదని ప్రపంచ దేశాలు తీర్మానిస్తున్నాయి. ఎసిడిటీ మరియు రిఫ్లెక్స్‌లనుంచి ఉపశమనం కోసం ఈ మందుని వినియోగిస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా. ఇంటర్నేషనల్‌ హెల్త్‌ అథారిటీస్‌ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్‌ బాదెర్‌ చెప్పారు. పేషెంట్లు, ప్రత్యామ్నాయ మందుల కోసం వైద్యులను సంప్రదించాలని అల్‌ బాదెర్‌ సూచించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com