దోహా లో నిర్వహించిన 'ఉచిత వైద్య శిబిరం'

- September 28, 2019 , by Maagulf
దోహా లో నిర్వహించిన 'ఉచిత వైద్య శిబిరం'

దోహా:ICBF వారి సౌజన్యంతో తెలంగాణ గల్ఫ్ సమితి కార్మిక సోదరులు మరియు మత్స్యకారుల కోసం నిర్వహించిన అల్లివియా మెడికల్ సెంటర్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

దోహా లో భారత రాయబారి  పి.కుమరన్  రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ICBF అధ్యక్షుడు బాబు రాజన్, ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ ,జనరల్ సెక్రెటరీ ఆవినాష్ , అడిషినల్ జనరల్ సెక్రటరీ సుభ్రమణ్యం హెబ్బెగళు, సంతోష్ కుమార్, రజినీ మూర్తి  పర్యవేక్షణలో జరిగింది.

ఈ శిబిరానికి దాదాపు 500  మందికి పైగా కార్మికులు హజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అల్లీవియా మెడికల్ సెంటర్ వారు నిపుణులైన వైద్య బ్రుందం ఏర్పాటు చేయడడమే కాకుండా వెల్ కేర్ వారి సహకారంతో ఉచితంగా కావాల్సిన మందులు సైతం పంపిణీ చేశారు.

ఈ విజయవంతమైన  కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ICBF కమిటీ కి, అల్లీవియా మెడికల్ సెంటర్ యాజమాన్యానికి, వైద్య బ్రుందానికీ మరియు స్టాఫ్ కు, వలంటీర్లకు ..ముఖ్యంగా ఈ   వైద్య శిబిరం విజయవంతం కావడానికి తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గానికీ, సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com