దుబాయ్‌లో రోడ్‌ యాక్సిడెంట్‌: 8 మంది మృతి, ఆరుగురికి గాయాలు

- September 30, 2019 , by Maagulf
దుబాయ్‌లో రోడ్‌ యాక్సిడెంట్‌: 8 మంది మృతి, ఆరుగురికి గాయాలు

దుబాయ్‌లో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. షార్జా వైపుగా షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిర్దిఫ్‌ సిటీ సెంటర్‌ ఎగ్జిట్‌కి దగ్గరలో జరిగిన ఈ ప్రమాదంలో 14 సీటర్‌ మినీ బస్‌, హెవీ లారీని ఢీకొంది. బస్‌ డ్రైవర్‌, ఏడుగురు ప్రయాణీకులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ప్రయాణీకులకు తీవ్ర గాయాలు కాగా, నలుగురికి ఓ మోస్తరుగా గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారంతా ఆసియా జాతీయులేనని దుబాయ్‌ పోలీస్‌ వెల్లడించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com